OTT: ‘మయసభ’ పై దర్శకుని ప్రామిస్!

లేటెస్ట్ గా మన టాలీవుడ్ ఓటిటి ఆడియెన్స్ లో మంచి ఆసక్తి రేకెత్తించిన తెలుగు ఓటిటి కంటెంట్ ఏదన్నా ఉంది అంటే అది దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ఫిక్షనల్ పొలిటికల్ డ్రామా “మయసభ” అని చెప్పాలి. ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో తెలుగు రాష్ట్రాలకి చెందిన ప్రఖ్యాత రాజకీయ నాయకుల యుక్త వయస్సు సమయంలో రాజకీయ డ్రామాని ఊహించని విధంగా ఆవిష్కరించడంతో దీనిపై టీజర్ వచ్చిన వెంటనే మంచి స్పందన మొదలైంది.

దీనితో దర్శకుడు దేవా కట్ట ఆడియెన్స్ కి ఒక ప్రామిస్ అయితే అందిస్తున్నారు. “గంట గంటకీ టీజర్‌ మీద పెరుగుతున్న మీ ఆసక్తికి, అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో నుంచి వస్తున్న ట్రెండింగ్ రెస్పాన్స్‌కి కృతజ్ఞతలు! ఇది మాత్రం గారెంటీ: ఏ పార్టీకి చెందిన వారైనా, ఏ నాయకుని భక్తులైనా… నాయకులకతీతంగా, పార్టీలకతీతంగా ఒక ఉన్నతమైన మానవీయ అనుభూతినిస్తుంది” అని తెలుపుతున్నారు. దీనితో ఈ సాలిడ్ ప్రాజెక్ట్ మీద మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ ఈ ఆగస్ట్ 7 నుంచి పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

Exit mobile version