‘మహావతార నరసింహ’ కోసం గీతా ఆర్ట్స్!

మన ఇండియన్ సినిమా దగ్గర యానిమేషన్ సినిమాలు రావడం అనేదే చాలా అరుదు కానీ ఈ జానర్ లో కూడా డివోషనల్ టచ్ తో కన్నడ నిర్మాణ సంస్థ హోంబళే ఫిలిమ్స్ వారు నిర్మాణం వచ్చిన చిత్రమే “మహావతార నరసింహ”. భారీ విజువల్స్ అండ్ ఊహించని యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆస్యపరిచిన ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచింది.

మరి పాన్ ఇండియా లెవెల్లో అనౌన్స్ చేసిన మేకర్స్ ఇపుడు తెలుగు రిలీజ్ పై ఓ అప్డేట్ అందించారు. ఈ సినిమాని మన టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగులో భారీ లెవెల్లో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. దీనితో ఈ జూలై 25న మహావతార నరసింహ తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందించగా అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు.

Exit mobile version