త్వరలో మొదలు కానున్న ‘మంత్ర’ దర్శకుడి మూడవ చిత్రం

త్వరలో మొదలు కానున్న ‘మంత్ర’ దర్శకుడి మూడవ చిత్రం

Published on Oct 19, 2012 12:30 PM IST


“మంత్ర చిత్రంతో దర్శకుడిగా మారి మొదటి చిత్రంతోనే తన కథానాయికకు నంది అవార్డ్ వచ్చేలా నటింపజేసిన దర్శకుడు ఓషో తులసి రామ్. అయన మంత్ర తరువాత తన స్వీయ నిర్మాణంలో “మంగళ” అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఆసక్తికరమయిన విషయం ఏంటంటే ఈ చిత్రానికి గాను చార్మీ మరోసారి నంది అవార్డ్ ని అందుకోవడం. ఈ దర్శకుడు ప్రస్తుతం మూడవ చిత్రం మొదలు పెట్టనున్నారు తులసి సినీ కార్పోరేషన్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించనున్నారు ఈ చిత్రంలో ప్రధాన తారాగణం నటించనున్నారని సమాచారం. డిసెంబర్ లో ప్రారంభం కానున్న ఈ చిత్రం లవ్,యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మిళితం అయిన కథతో తెరకెక్కనుంది. ఒక ప్రముఖ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. విశ్వ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

తాజా వార్తలు