రామ్ తో త్రివిక్రమ్ మల్టీస్టారర్ !

రామ్ తో త్రివిక్రమ్ మల్టీస్టారర్ !

Published on Feb 1, 2021 10:07 PM IST


హీరో రామ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా వస్తోందంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్లు రామ్, త్రివిక్రమ్ తో తన సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించి తన ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది త్రివిక్రమ్ ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని.. పవన్ కళ్యాణ్ కోసం రాసిన ఓ కథలో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉందని.. ఆ క్యారెక్టర్ లో రామ్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడట.

రామ్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను మీడియాతో పంచుకుంటూ త్రివిక్రమ్ సినిమా గురించి కూడా ప్రస్తావించారు. త్రివిక్రమ్‌ తో గతంలో మాట్లాడానని, మా ఇద్దరి కలయికలో తర్వాత ఓ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మరి, రామ్ చెప్పింది బహుశా ఈ మల్టీస్టారర్ గురించే అనుకుంటా. మొత్తానికి రామ్, చిన్న క్లారిటీ అయితే ఇచ్చాడు. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడ ఒకరు. పైగా ఆయన గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది. అందుకే ప్రతి హీరో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తనని అప్రోచ్ అయిన రామ్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు