రామ్ సినిమాకు త్రివిక్రమ్ పర్ఫెక్ట్ ప్లానింగ్.?

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైనటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ల కలయికలో ఊహించని కాంబో సెట్టయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కాంబో అసలు ఊహించనటువంటిది కావడంతో ఒక్కసారిగా మంచి బజ్ సంతరించుకుంది. ఈ ఇద్దరికి ఫ్యామిలీ ఆడియెన్స్ సహా మాస్ లో మంచి మార్కెట్ ఉంది.

అలాంటిది ఈ ఇద్దరి సినిమా అనేసరికి సరికొత్త అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కోసం మాత్రం త్రివిక్రమ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ వేస్తున్నారట. ఆల్రెడీ బడ్జెట్ ను 40 కోట్ల లోపే అని ఫిక్స్ చేశారట అంతే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అందుకు తాను టాలీవుడ్ కు పరిచయం చేసిన టాప్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను అనుకుంటున్నట్టు ఇప్పుడు సమాచారం. ఇలా ఈ సినిమా విషయంలో గురూజీ ప్లానింగ్ లో ఉన్నారట.

Exit mobile version