మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం “విశ్వంభర”. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. అయితే. ఈ రోజు, త్రిష పుట్టినరోజు. త్రిషకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో త్రిష అవని పాత్రను పోషిస్తుందని మేకర్స్ వెల్లడించారు. ఇక పోస్టర్లో త్రిష లుక్ అద్భుతంగా ఉంది.ఇక ఈ చిత్రం అధికారిక విడుదల తేదీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అన్నట్టు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ లోని సెంటిమెంట్ ఈ సోషియో ఫాంటసీ సినిమాలో కనిపిస్తాయని తెలుస్తోంది. కాగా సృష్టి, స్థితి, లయ ఈ మూడింటి నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా మరియు అశ్రిత వేముగంటి నండూరి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.