‘జటాధర’ నుండి ట్రెండ్ సెట్ చేస్తున్న పిల్లోడు..!

‘జటాధర’ నుండి ట్రెండ్ సెట్ చేస్తున్న పిల్లోడు..!

Published on Oct 15, 2025 9:00 PM IST

Jatadhara

ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి తాజాగా ‘ట్రెండ్ సెట్ చెయ్’ అనే సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నవ ధళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఫస్ట్ గ్లింప్స్‌ మరియు రెండు పాటలతోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ కొత్త సాంగ్‌తో మరింత హైప్ సృష్టిస్తోంది.

రాయీజ్ & జైన్ – సామ్ సంగీతం అందించిన ఈ పాట ఎలక్ట్రానిక్ బీట్స్‌తో ఉత్సాహభరితంగా ఉంది. స్పూర్తి జితేందర్ మరియు రాజీవ్ రాజ్ గానం, శ్రీమణి యూత్‌ఫుల్ లిరిక్స్‌ కలిసి పాటకు ఎనర్జీని తీసుకొచ్చాయి. ఇది సినిమాలోని సింగిల్ హీరో వైబ్‌కి తగిన యాంతమ్‌లా అనిపిస్తోంది.

ఈ పాటలో సుధీర్ బాబు స్టైలిష్ డ్యాన్స్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయనతో పాటు శ్రేయ శర్మ గ్లామరస్ లుక్‌లో కనిపించారు. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో, జీ స్టూడియోస్ మరియు ప్రేరణ అరోరా (ఎస్‌కే‌జీ ఎంటర్టైన్మెంట్) నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు