‘డ్రాగన్’ రిలీజ్ ఎప్పుడో చేప్పేసిన మేకర్స్..!

‘డ్రాగన్’ రిలీజ్ ఎప్పుడో చేప్పేసిన మేకర్స్..!

Published on Oct 15, 2025 11:13 PM IST

NTRNeel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘డ్రాగన్’ కోసం ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో లీన్ లుక్ కోసం ఎన్‌టీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

కొద్ది రోజుల క్రితం నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ షూటింగ్ 2026 సమ్మర్ వరకు కొనసాగుతుందని వెల్లడించడంతో, సినిమా 2027కి వాయిదా పడుతుందేమోననే సందేహాలు మొదలయ్యాయి. అయితే ‘డ్యూడ్’ ప్రమోషన్స్ సందర్భంగా ఆయన స్పష్టం చేస్తూ, సినిమా 2026లోనే విడుదల అవుతుందని చెప్పారు.

మొదట జూన్ 25, 2026న రిలీజ్‌గా ప్రకటించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు బట్టి ఆ తేదీకి రిలీజ్ కావడం కష్టమే. అయినప్పటికీ, నిర్మాతలు ఈ చిత్రం 2026లోనే రావడం ఖాయమని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు.

తాజా వార్తలు