దీపావళి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిత్ర మండలి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం హీరో హీరోయిన్ గా నటిస్తుండగా రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా ఇతర లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ చిత్రం అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ కానుండగా ఒకరోజు ముందుగానే స్పెషల్ ప్రీమియర్స్ వేశారు.
ఈ సందర్భంగా ఈ చిత్ర నాన్-థియేట్రికల్ రైట్స్‌కు సంబంధించిన వార్తలు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి రూ.9.5 కోట్ల మేర నాన్-థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా, శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ దక్కించుకుంది.
ఈ బిజినెస్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాలోని యూత్‌ఫుల్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్ రెడ్డి తీగల నిర్మించగా బన్నీ వాస్ ప్రజెంట్ చేస్తున్నారు. విజయేందర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.