కన్ఫార్మ్: ప్రభాస్, హను ప్రాజెక్ట్ రిలీజ్ అప్పుడే!

కన్ఫార్మ్: ప్రభాస్, హను ప్రాజెక్ట్ రిలీజ్ అప్పుడే!

Published on Oct 15, 2025 4:00 PM IST

Fauji

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవాపుడితో చేస్తున్న పీరియాడిక్ చిత్రం కూడా ఒకటి. మరి ఈ సినిమా షూటింగ్, ది రాజా సాబ్ తోనే పార్లల్ గా జరుగుతూ వెళుతుండగా ఈ సినిమా రిలీజ్ పై లేటెస్ట్ కన్ఫర్మేషన్ బయటకి వచ్చేసింది. దీనితో ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

అయితే ఈ సినిమా నిర్మాతలు నవీన్ యెర్నేని అలాగే రవి శంకర్ లు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తమ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో తేల్చేసారు. దీనితో ఈ సినిమా ఇది వరకు వచ్చిన టాక్ ప్రకారం గానే వచ్చే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ కి ఫిక్స్ చేశారట. సో ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా యంగ్ హీరోయిన్ ఇమాన్వి నటిస్తుంది అలాగే అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు