మహేష్ కష్టం సామాన్యమైంది కాదు

మహేష్ కష్టం సామాన్యమైంది కాదు

Published on Feb 20, 2021 12:32 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేష్ ఎన్నడూ లేని కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. మునుపటి కంటే సన్నగా మారి సూపర్ ఫిట్ గా కనిపిస్తున్నారు. అఫీషియల్ పోస్టర్ ఏదీ రాకపోయినా వర్కింగ్ స్టిల్స్, ఆన్ లోకేషన్ ఫోటోలూ మహేష్ లుక్ చూసి మురిసిపోతున్నారు అభిమానులు. సినిమాలో ఆయన మేకోవర్ పెద్ద సప్రైజ్ అవుతుందని ఆశిస్తున్నారు.

అయితే ఈ లుక్ సాధించడం వెనుక మహేష్ కష్టం చాలానే ఉంది. ఏదో సాదా సీదా వర్కవుట్స్ చేసి తెచ్చుకున్న లుక్ కాదది. ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకమైన వర్కవుట్స్ చేస్తున్నారు మహేష్. ప్రత్యేకంగా ఒక ట్రైనర్ కూడ ఉన్నారు ఆయనకు. దుబాయ్ లో కూడ అదే ట్రైన్ఫర్ శిక్షణలో వర్కవుట్స్ చేస్తున్నారు. దుబాయ్ వెళ్లిననాటి నుండి మహేష్ ఒక్కరోజు కూడ జిమ్ మిస్సవలేదట. రోజంతా షూటింగ్లో అలిసిపోయినా, దెబ్బలు తలిగిలినా వేటినీ లెక్కచేయకుండా వర్కవుట్స్ చేస్తున్నాడట సూపర్ స్టార్. ఆయన డెడికేషన్ చూసి ట్రైనర్ సైతం ఆశ్చర్యపోయి సోషల్ మీడియా మహేష్ డెడికేషన్ గురించి పెద్ద పోస్ట్ పెట్టి మహేష్ లాంటి పర్ఫెక్షనిస్ట్ ని చూడలేదని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు