సెన్సార్ పనులు ముగించుకున్న ‘కింగ్డమ్’.. రన్‌టైమ్ ఎంతంటే..?

సెన్సార్ పనులు ముగించుకున్న ‘కింగ్డమ్’.. రన్‌టైమ్ ఎంతంటే..?

Published on Jul 28, 2025 5:30 PM IST

Kingdom

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ ఈ నెల 31న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 40 నిమిషాలుగా లాక్ అయింది. అయితే, ఈ సినిమాలోని కొన్ని అభ్యంతరకర సీన్స్, డైలాగులు తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించడంతో 2 నిమిషాల 31 సెకన్ల సన్నివేశాలను రీప్లేస్ చేశారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ ప్యాక్డ్ యాక్షన్‌తో ఇరగదీశాడని.. ఆయన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు