స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ, అందాల భామ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రాన్ని నీరజ కోన డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘మల్లిక గంధ’ అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండటంతో ఈ పాటపై ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడుతుండటంతో థమన్-సిద్ శ్రీరామ్ కలయికలో మరో మెలోడీ హిట్ ఖాయమని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అభిమానులు ఆశించినట్లుగానే ఈ పాట క్లాసిక్ టచ్‌తో పాటు ఫాస్ట్ బీట్‌ను కలిగి ఉంది. ఇక థమన్ సంగీతానికి సిద్ శ్రీరామ్ తనదైన ట్రీట్మెంట్‌తో ఈ పాటను పాడిన విధానం బాగుంది.
మొత్తానికి ‘మల్లిక గంధ’ అంటూ వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి వస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి