ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త అవతారంలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ సినిమాతో రామ్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్కు సంబంధించి ఇప్పుడు తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం(జూలై 28) నుంచి వారం రోజుల పాటు రాత్రి సమయంలో జరగనుంది.. ఈ షెడ్యూల్లో నైట్ సీన్స్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ వారం రోజులు కొనసాగుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వివేక్-మెర్విన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.