దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ‘కాంత’ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇక దుల్కర్ తన నెక్స్ట్ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ నుండి కూడా ఓ సాలిడ్ ట్రీట్ అయితే ఇచ్చాడు.
దర్శకుడు పవన్ సాదినేని డైరెక్ట్ చేస్తున్న ఈ ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఓ మధ్య తరగతి వ్యక్తి జీవితాన్ని మన కళ్లకు కట్టినట్లు దుల్కర్ ఈ సినిమాలో చూపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా జి.వి.ప్రకాష్ కుమార్ తన బీజీఎంతో మార్చాడు.
ఈ గ్లింప్స్ చివర్లో ఒక అమ్మాయి స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్తున్న సీన్ మనకు చూపెట్టారు. దీంతో ఈ సినిమాలో తండ్రీ కూతురు మధ్య ఎమోషనల్ బాండింగ్ కథను మనకు చూపెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్లు సమర్పిస్తుండగా లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి