ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపుతున్న ట్రైలర్స్

ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపుతున్న ట్రైలర్స్

Published on Oct 24, 2012 9:20 PM IST


చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించేది ఓపెనింగ్స్, ఈ మధ్య కాలంలో ఓపెనింగ్స్ చిత్ర ఫలితాన్ని నిర్ణయిస్తున్నాయి అంటే పరిశ్రమలో చిత్రానికి ఓపెనింగ్స్ ఎంత ముఖ్యమో తెలుస్తుంది. ఒక చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అందులో సంగీతం బాగుండటం ఒకటి అయితే ట్రైలర్ మరొక మార్గం. ట్రైలర్ కట్ చెయ్యడంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తే ఆ చిత్రానికి ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ఉదాహరణకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “దమ్ము” చిత్ర ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో అప్పట్లో ఆ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి బోయపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సాదిస్తుంది అనే అనుకున్నారు అనుకున్నట్టుగానే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి కాని ఈ చిత్రం అనుకున్న స్థాయిలో లేకపోవడం నిరాశపరిచింది. పెద్ద చిత్రాలకే ఇలా జరుగుతుంది అనుకుంటే పోరాపాటు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో వచ్చిన “సుడిగాడు” చిత్రం ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది అంటే కేవలం ట్రైలర్ మూలాన అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇలాంటి అంచనాలే పెంచుతున్న చిత్రాలు “కృష్ణం వందే జగద్గురుం” మరియు “జేఫ్ఫా” ఈ రెండు ట్రైలర్లు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ రావటం ఖాయమనే చెప్పాలి కాని ఓపెనింగ్స్ ని నిలబెట్టుకొని విజయం సాదిస్తుందా లేదా అన్నదే వేచి చూడాల్సిన అంశం.

తాజా వార్తలు