క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?

క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?

Published on Sep 7, 2025 12:00 PM IST

SSMB29

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర చాలానే భారీ ప్రాజెక్ట్ లు ఉన్నప్పటికీ వాటిలో పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయని చెప్పాలి. మరి ఆ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం కూడా ఒకటి. ఇటీవల కెన్యా షెడ్యూల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. ఇక ఈ ఏడాది నవంబర్ లో కూడా సాలిడ్ ట్రీట్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

అయితే నవంబర్ లో ఫస్ట్ లుక్ రివీల్ చేస్తారని తెలిసిందే. కానీ దానితో పాటుగా అంతకు మించి ట్రీట్ గా సినిమా తాలూకా ఫస్ట్ గ్లింప్స్ ని అలాగే రిలీజ్ డేట్ ప్రకటన కూడా అందులోనే ఉంటుందని టాక్ వచ్చింది. మరి దీని కోసం రాజమౌళి ఇది వరకు ఎన్నడూ ఏ సినిమాకి చేయని రీతిలో ప్లానింగ్ ని అనౌన్సమెంట్ కోసం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనితో వరల్డ్ వైడ్ సినిమా దగ్గర ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా మాట్లాడుకునే ఛాన్స్ ఉందట. సో మొత్తానికి మాత్రం నవంబర్ లో ప్రపంచమే షేక్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు.

తాజా వార్తలు