తన నడుము ఓంపుసొంపులతో మరియు అభినయంతో సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకున్న అందాల భామ మిల్క్ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం తమన్నా అజయ్ దేవగన్ హీరోగా రానున్న ‘హిమ్మత్ వాలా’ రిమేక్ ద్వారా బాలీవుడ్లో పరిచయం కానుంది. తన బాలీవుడ్ విశేషాల గురించి మీడియాతో పంచుకున్నారు. ‘ బాలీవుడ్ అందరి దృష్టి టాలీవుడ్ పైనే ఉంటుంది. ఇక్కడి సినిమాలు ‘పోకిరి’ మరియు ‘విక్రమార్కుడు’ సినిమాలు అక్కడ రీమేక్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడమే కాకుండా, 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించాయి. ‘హిమ్మత్ వాలా’ కూడా టాలీవుడ్ రిమేక్ సినిమానే. బాలీవుడ్లో నడిచే హాట్ టాపిక్ ఏంటి అంటే టాలీవుడ్’ అని ఆమె అన్నారు.
తన భవిష్యత్ ప్రణాలికలు ఏమిటి? అని అడిగితే తమన్నా సమాధానమిస్తూ ‘ నేను సౌత్ ఇండియన్ సినిమాలనే ఎక్కువ ఇష్టపడతాను. నేను ఈ ఇండస్ట్రీని వదిలిపెట్టను, నేను ఇక్కడి వారితో ఎంతో ముడిపడిపోయాను. నా మొదటి ప్రాధాన్యత టాలీవుడ్ కి మాత్రమే ఆ తర్వాతే బాలీవుడ్ కి ప్రాధాన్యమని’ అన్నారు.