‘సతీ లీలావతి’ టీజర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

‘సతీ లీలావతి’ టీజర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Published on Jul 29, 2025 1:01 AM IST

అందాల భామ లావణ్య త్రిపాఠి నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘సతీ లీలావతి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను తాతినేని సత్య డైరెక్ట్ చేస్తుండగా దేవ్ మోహన్ మేల్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.

‘సతీ లీలావతి’ చిత్ర టీజర్‌ను జూలై 29న ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వారు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ద్వారా వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ టీజర్ ఆద్యంతం ఫన్ రైడ్‌గా ఎంటర్‌టైన్ చేయడం ఖాయమని వారు అంటున్నారు.

ఈ సినిమాలో దేవ్ మోహన్, లావణ్య మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని.. ఈ సినిమాను ప్రేక్షకులకు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నాగమోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు