‘థలా’ అజిత్ “వాలిమై” ఫస్ట్ లుక్ కు టైం ఫిక్స్.!

‘థలా’ అజిత్ “వాలిమై” ఫస్ట్ లుక్ కు టైం ఫిక్స్.!

Published on Feb 11, 2021 12:01 PM IST

మన టాలీవుడ్ లో గట్టి మార్కెట్ లేకపోయినా కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కు కూడా ఇప్పుడిప్పుడే మంచి మార్కెట్ ఏర్పడుతుండడంతో ఆయన సినిమాల పట్ల మాస్ ఆడియెన్స్ లో మంచి ఒపీనియన్ అయితే ఏర్పడుతుంది. మరి అలా అజిత్ ఇప్పుడు చేస్తున్న “వాలిమై” సినిమాకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అక్కడి టాలెంటెడ్ దర్శకుడు హెచ్ వినోథ్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. దీనితో ఈ సినిమా కోసం అజిత్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఫైనల్ గా ఈ మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే మార్చ్ నెలలో విడుదలకు రెడీ చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో అజిత్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఫస్ట్ లుక్ అప్పుడే వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు