టాలీవుడ్‌లో ఇటీవల చాలా సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఈ జాబితాలో స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఘాటి’ కూడా ఒకటి. ఈ సినిమాను ఏప్రిల్ నుంచి వరుసగా వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్ 5కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఇక ఇదే డేట్‌పై తెలుగులో మరో రెండు సినిమాలు కన్నేశాయి. తేజా సజ్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’ కూడా సెప్టెంబర్ 5న వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో పాటు గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంతో రష్మిక మందన్న కూడా ఓ సాలిడ్ సక్సెస్ కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఈ సినిమాను కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
వీటితో పాటు ఓ తమిళ డబ్బింగ్ చిత్రం కూడా ఇదే రోజున వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న ‘మదరాసీ’ చిత్రం కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇలా ఒకే రోజున రిలీజ్ అయ్యేందుకు 3 తెలుగు సినిమాలు, 1 డబ్బింగ్ చిత్రం పోటీ పడుతున్నాయి. మరి సెప్టెంబర్ 5న టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏయే సినిమాలు రిలీజ్ అవుతాయో చూడాలి.