మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ షూటింగ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
కాగా, ఈ పాటలో చిరంజీవితో పాటు స్టార్ బ్యూటీ నయనతార కూడా కనిపిస్తోంది. అయితే, ఈ సాంగ్ సెట్స్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫోటో ఒకటి మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో చిరు అల్ట్రా కూల్ లుక్స్‌తో అదరగొట్టారు. చిరుని ఇలాంటి లుక్ లో చూసి అభిమానులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.