మన టాలీవుడ్ దగ్గర బ్లాక్ బస్టర్ సినిమాలతో సాలిడ్ హిట్స్ అందించిన దర్శకుల్లో శ్రీను వైట్ల కూడా ఒకరు. తన మార్క్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందించిన తాను ఇటీవల “విశ్వం” సినిమాతో మంచి కంబ్యాక్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్ ఇపుడు వినిపిస్తుంది.
దీని ప్రకారం శ్రీను వైట్ల నెక్స్ట్ ప్రాజెక్ట్ గా యూత్ స్టార్ నితిన్ తో సినిమా ఓకే చేసుకున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. దీనితో శ్రీను వైట్ల నెక్స్ట్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ వీరి కాంబినేషన్ ఓకే అయితే వీరి నుంచి మొదటి ప్రాజెక్ట్ ఇది అని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గానే నితిన్ “తమ్ముడు” సినిమాతో పలకరించగా తాను కూడా మంచి కంబ్యాక్ అందుకోవాలని చూస్తున్నాడు.