టాక్.. ‘కాంతార 1’ కి కూడా పైడ్ ప్రీమియర్స్?

టాక్.. ‘కాంతార 1’ కి కూడా పైడ్ ప్రీమియర్స్?

Published on Sep 9, 2025 3:05 PM IST

Kantara-Chapter-1

టాలెంటెడ్ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి నుంచి వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “కాంతార” కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి దీనికి ప్రీక్వెల్ గా కాంతార 1 సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గానే సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అని వచ్చిన రూమర్స్ లో నిజం లేదని మేకర్స్ ఒరిజినల్ డేట్ లోనే వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. దీని ప్రకారం మేకర్స్ రిలీజ్ కి ముందు రోజే అంటే అక్టోబర్ 1 రాత్రి నుంచి పైడ్ ప్రీమియర్స్ ని వేసే ప్లానింగ్ లో ఉన్నట్టు వినిపిస్తుంది. అయితే ఇది కన్నడ, తెలుగు లోనేనా లేక ఇండియా మొత్తంగానా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ పైడ్ ప్రీమియర్స్ కి సంబంధించి అధికారిక అప్డేట్ కూడా ఇంకా రావాల్సి ఉంది.

తాజా వార్తలు