బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో

బొమ్మల సినిమాకి ఈ రేంజ్ సీనుందా.. నెక్స్ట్ లెవెల్ హైప్ తో

Published on Sep 9, 2025 4:00 PM IST

Demon Slayer

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ యుద్ధమే మూవీ లవర్స్ నడుమ జరుగుతుంది. ఇప్పుడున్న జెనరేషన్ లో దాదాపు అందరికీ కార్టూన్స్ అలాగే 3డి యానిమేటెడ్ షోస్ లాంటివి అంటే మినిమమ్ తెలిసే ఉంటుంది. కానీ ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. అలాంటి వాటిలో జపాన్ లో పుట్టుకొచ్చిన Anime (అనిమే) కూడా ఒకటి. అయితే ఈ అనిమే కంటెంట్ కి ఉన్న రీచ్ అంతా ఇంతా కాదు.

దీని విషయంలో సోషల్ మీడియాలో యుద్ధమే జరుగుతుంది. చాలా మంది వీటిని సింపుల్ గా బొమ్మలు సినిమాలు, షోస్ అని కొట్టి పడేస్తారు కానీ ఈ కంటెంట్ కి ఉన్న రీచ్ గాని వాటిని ఇష్టపడేవారి సంఖ్య గాని చాలా ఎక్కువ. నిజానికి నిజమైన మనుషులు భారీ గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలు కూడా ఇవ్వని హై మూమెంట్స్ ని ఈ అనిమే సినిమాలు, షోలు అందిస్తాయని వీటి లవర్స్ అంటారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చకి వచ్చింది అంటే లేటెస్ట్ గా ఇండియన్ సినిమా దగ్గర ఒక జపాన్ అనిమే సినిమా సంచలనం సృష్టిస్తుంది. అదే “డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాసిల్”. అయితే దీనికి ముందు పలు సిరీస్ లు కూడా ఉండగా ఇందులో మొదటి థియేట్రికల్ సినిమాగా “డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాసిల్” వస్తుంది.

ఈ సినిమా ఇండియా సహా ఇతర దక్షిణ ఆసియ దేశాల్లో ఈ సెప్టెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా ఈ సినిమాకి కేవలం మన దేశం నుంచే 20 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఇది నిజానికి చాలా మందికి తెలిసి కూడా ఉండదు అయినప్పటికీ ఈ రేంజ్ ఓపెనింగ్స్ అండ్ బుకింగ్స్ అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ అనిమే సినిమా రేంజ్ ఏంటి అనేది.

ఇంట్రెస్టింగ్ గా మన తెలుగు వెర్షన్, జాపనీస్, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ సినిమాకి సాలిడ్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. అలాగే దీనికి డిమాండ్ కూడా ఏ లెవెల్లో ఉందంటే తెలుగు స్టేట్స్ లో ఉదయం 8 గంటల నుంచి షోలు హిందీలో అయితే ఏకంగా తెల్లవారు జామున 5 గంటలకి కూడా వేస్తున్నారు. దీనితో ఈ తరహా కంటెంట్ ని బొమ్మలు కంటెంట్ అనేవారికి సైతం మతి పోగొడుతుంది ఈ సినిమా. ఇక రిలీజ్ అయ్యాక ఇండియా వైడ్ వసూళ్లు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు