విజయ్ సినిమా కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్స్..!

ఇళయ థలపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్”. తమిళ్ మరియు తెలుగు భాషల్లో కూడా మంచి హిట్ గా నిలిచిన ఈ చిత్రంతో విజయ్ మన దగ్గర కూడా మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్నాడు. అంతే కాకుండా జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా సరే బాక్సాఫీస్ దగ్గర భారీ లెక్కలనే సెట్ చేస్తున్నాడు ఈ స్టార్ హీరో.

ఇక ఈ చిత్రం సాలిడ్ హిట్ తర్వాత విజయ్ అక్కడి టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో తన 65వ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రానికి గాను ముగ్గురు స్టార్ హీరోయిన్స్ పేర్లు అండర్ లో ఉన్నాయట. అది కూడా ఆ ముగ్గురూ పాన్ ఇండియన్ లెవెల్ హీరోయిన్సే..

వారు కియారా అద్వానీ, రష్మికా మందన్నా అలాగే పూజా హెగ్డే అని తెలుస్తుంది. మరి వీరిలో ఎవరో ఒకరు విజయ్ సరసన కన్ఫర్మ్ అవుతారని తెలుస్తుంది. మరి ఈ చిత్రంలో ఎవరు కనిపిస్తారో చూడాలి. అలాగే ఈ చిత్రానికి కేజీయఫ్ స్టంట్ మాస్టర్స్ అన్బు – అరివు లు యాక్షన్ పార్ట్ ను కొరియోగ్రాఫ్ చేయనున్నట్టు కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Exit mobile version