ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. జెట్ స్పీడ్ లో షూటింగ్ కొనసాగిస్తున్న ఈ సినిమాలో ఓ సాంగ్ షూటింగ్ చేస్తుండగా సినీ ప్రముఖులు షూటింగ్ లోకి వెళ్లి అక్కడ తాము చూసిన విజువల్స్ తో ఎగ్జైట్ అయ్యారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో కింగ్డమ్ యూనిట్ కూడా వెళ్లి సందడి చేసినట్టు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుండగా కింగ్డమ్ మెయిన్ యూనిట్ వెళ్లారట.
పవన్ కళ్యాణ్ ని కూడా కలిసినట్టు సినీ వర్గాలలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఫైనల్ గా సితార టీం ఆ పిక్ ని విడుదల చేసేసారు. మరి ఇందులో పవర్ స్టార్ తో విజయ్ దేవరకొండ, నిర్మాత నాగవంశీ, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే లు కనిపిస్తున్నారు. మరి ఈ పిక్ లో మాత్రం అందరూ డైనమిక్ గా కనిపిస్తుండగా పవన్ మాత్రం సూట్ లో ఫ్రేమ్ కి మరింత స్పెషల్ గా మారారని చెప్పవచ్చు. ఇది చూసిన ఫ్యాన్స్ మాత్రం మంచి ఎగ్జైట్ అవుతున్నారు. ఇక కింగ్డమ్ రేపు ఆగస్టు 31న గ్రాండ్ గా విడుదలకి రాబోతుండగా ఉస్తాద్ భగత్ సింగ్ ని మేకర్స్ వచ్చే ఏడాదికి ప్లాన్ చేస్తున్నారు.