నాని “వి” అందుకే ఆరోజున..?

నాని “వి” అందుకే ఆరోజున..?

Published on Aug 21, 2020 7:01 AM IST

చాలా సస్పెన్స్ అనంతరం నాచురల్ స్టార్ నాని యాంటీ హీరోగా కనిపించనున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “వి” డిజిటల్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రం నేరుగా ఓటిటిలో వస్తుందని హింట్ ఇస్తూనే నిజం చేసి నిర్మాణ సంస్థ వచ్చే సెప్టెంబర్ 5 వ తారీఖున అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి తీసుకురానున్నారని తెలిపారు.అయితే వారు పర్టికులర్ గా అదే రోజును ఎందుకు ఎన్నుకొన్నారో చిన్న లాజిక్ ఇప్పుడు వినిపిస్తోంది.

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మొదటి సినిమా “అష్టా చమ్మా” సెప్టెంబర్ 5న విడుదలై సరిగ్గా తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి 12 ఏళ్ళు పూర్తి కానుంది. అందుకు మేకర్స్ ఆ స్పెషల్ రోజున నాని తన కెరీర్ లో బెంచ్ మార్క్ రోల్ చేసిన ఈ స్పెషల్ రోజున ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

నాని యాంటీ హీరోగా కనిపించనున్న ఈ ప్రాజెక్ట్ లో హీరోగా సుధీర్ బాబు కనిపించనుండగా నివేత థామస్ మరియు అదితి రావ్ హైదరీలు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు