“ఆచార్య”లో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే..అసలు కథ ముందుంది.!

“ఆచార్య”లో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే..అసలు కథ ముందుంది.!

Published on Jan 31, 2021 8:30 PM IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య”. మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్ ను మేకర్స్ ఇటీవలే విడుదల చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

మరి అలాగే ఇప్పుడు ఆ టీజర్ 10 మిలియన్ వ్యూస్ ను కూడా క్రాస్ చేసింది. అయితే ఈ టీజర్ లోనే ఒక అంశం బాగా హైలైట్ అయ్యిన సంగతి తెలిసిందే. అదే తిరు సినిమాటోగ్రఫీ, ప్రతీ ఫ్రేమ్ ను కూడా ఎరుపు వర్ణంలో చూపిస్తూ మెగాస్టార్ ను నెవర్ బిఫోర్ షాట్స్ లో చూపించారు.

మరి ఈ టీజర్ లో షాట్స్ జస్ట్ శాంపిల్ అని ఆయన అంటున్నారు. అలాగే అంతకు మించిన హీరోయిజం చిరు పై అదిరిపోయే షాట్స్ ఉంటాయని తెలుస్తుంది. అలాగే చరణ్ పై కూడా మైండ్ బ్లోయింగ్ ఇంట్రడక్షన్ షాట్స్ ప్లాన్ తెలుస్తుంది. మరి ఈ కొరటాల ఈ మెగా మల్టీ స్టారర్ ను ఎలా సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసారో తెలియాలి అంటే మే 13 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు