ఈ సెన్సేషనల్ డైరెక్టర్ మహేష్ ను అప్రోచ్ అయ్యారా?

ఈ సెన్సేషనల్ డైరెక్టర్ మహేష్ ను అప్రోచ్ అయ్యారా?

Published on Aug 22, 2020 3:02 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్టులను చేస్తున్నారు. ఒకటి దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే మాస్ కమెర్షియల్ చిత్రంలో నటిస్తుండగా దీని తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను చేయనున్నారు.

అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వచ్చిన భారీ గ్యాప్ లో మహేష్ ను మరో టాప్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ అప్రోచ్ అయ్యినట్టు టాక్ వినిపిస్తుంది. అతడే తన కేజీయఫ్ సినిమాతో మాస్ ఆడియెన్స్ లో ముద్ర వేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ గ్యాప్ లో మహేష్ తో ఒక ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక లైన్ ను చెప్పారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

కానీ మహేష్ మాత్రం ఆ స్టోరీ విషయంలో అంత సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మరి నీల్ నిజంగానే మహేష్ తో ప్రాజెక్టు చేస్తున్నారో లేదో కానీ ఈ కాంబోలో కూడా ఒక సినిమా సెట్ అయితే ఆ ఇంపాక్ట్ వేరే రేంజ్ లో ఉంటుందని చెప్పాలి.

తాజా వార్తలు