మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు పలు ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ చిత్రాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ బాక్సింగ్ చిత్రం “గని”. లేటెస్ట్ గా విడుదల కాబడిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి అంచనాలు తెచ్చుకున్న ఈ చిత్రంలో పలువురు స్టార్ నటులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వారిలో కన్నడ స్టార్ వెర్సిటైల్ హీరో ఉపేంద్ర కూడా ఉన్నారు.
మరి ఇప్పుడు ఈ నటుడు ఈ చిత్రంలో తాను చేయనున్న కీలక పాత్ర షూట్ ను ఇప్పుడు మొదలు పెట్టేసారు. హైదరాబాద్ లో ప్లాన్ చేసిన రెండో షెడ్యూల్ ఇప్పుడు నడుస్తుంది. మరి ఈ షూట్ లో ఈరోజు నుంచి ఉపేంద్ర పాల్గొన్నారు. మరి ఇందులో ఈ టాలెంటెడ్ నటుడు ఎలాంటి పాత్రలో నటిస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సిద్దు ముద్ద మరియు అల్లు బాబీలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.