ఈ సెన్సేషనల్ సిరీస్ ఫ్యాన్స్ ఇంకా హ్యాపీ అయ్యారు.!

ఈ సెన్సేషనల్ సిరీస్ ఫ్యాన్స్ ఇంకా హ్యాపీ అయ్యారు.!

Published on Feb 20, 2021 8:00 AM IST

ఇప్పుడు ఎంతగానో విస్తరించిన డిజిటల్ వరల్డ్ లో ప్రపంచ వ్యాప్తంగా కూడా వీక్షకులు ఉన్నారు. మరి అంత మందికి కూడా మంచి థ్రిల్ ను ఇచ్చే వెబ్ కంటెంట్ ను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థలు తీసుకొస్తున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ లో అత్యంత ఫేమస్ కాబడిన వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయ్యే “మనీ హేస్ట్” సిరీస్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ఒకదాని తర్వాత మరొకటి భారీ స్థాయి హిట్ అయ్యింది.

అంతే కాకుండా ఏ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో అయినా సరే అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా కూడా దీనికి అనేక రికార్డులు ఉన్నాయి. కానీ ఎంతో పాపులర్ అయినటువంటి ఈ వెబ్ సిరీస్ మన దగ్గర రీజనల్ భాషల్లో మాత్రం అందుబాటులోకి లేకపోవడంతో ఎంతో మందికి ఈ సిరీస్ కోసం తెలిసినా అంత బాగా చూడలేకపోతున్నారు. కొంతమంది అయితే పక్కనే పెట్టేసారు. కానీ ఎట్టకేలకు మాత్రం అలాంటి వారు అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది.

నెట్ ఫ్లిక్స్ వారు ఈ సెన్సేషనల్ సిరీస్ ను తెలుగు మరియు తమిళ్ ఆడియోస్ లో కూడా ఇప్పటి వరకు వచ్చిన నాలుగు సీజన్లను తీసుకొచ్చినట్టుగా నిన్న ప్రకటన వచ్చింది. దీనితో ఈ సిరీస్ ఫ్యాన్స్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంతకు ముందు ఇంగ్లీష్ లో అర్ధం అయ్యి కాని వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తున్నారు. మరి మీరు కూడా ఇప్పటి వరకు ఈ ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ సిరీస్ ను మిస్ అయితే చూసెయ్యండి ఇక.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు