పవన్ సినిమాలో ఈ సెన్సేషనల్ బ్యూటీ కన్ఫర్మే.!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లలో మోస్ట్ అవైటెడ్ చిత్రం క్రిష్ జాగర్ల మూడి తో చేస్తున్న పీరియాడిక్ డ్రామానే అని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజుల పలు ఇంట్రెస్టింగ్ అంశాలే సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

మొదటగా ఈ సినిమా టైటిల్ విషయంలో ఆసక్తి రేగగా.. తర్వాత మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఉన్నట్టుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ భారీ ప్రాజెక్ట్ లో ఈ సెన్సేషనల్ హీరోయిన్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా నిధినే చెప్పింది.

అంతే కాకుండా పవన్ లాంటి గ్రేట్ వ్యక్తితో పని చెయ్యడం ఇది తనకి ఒక గోల్డెన్ ఫిల్మ్ అని కితాబిచ్చింది. అయితే ఆ మధ్యనే ఈమె ఆన్ లొకేషన్ లో ఉన్న స్టిల్స్ బయటకు రావడంతో ఈ సినిమాలో ఉందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version