ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న క్లాస్ అండ్ మాస్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. అయితే ఈ చిత్రం తాలూకా షూట్ దుబాయ్ లో ఎంత శరవేగంగా జరుగుతుందో తెలిసిందే. ఈ షెడ్యూల్ లో కొన్ని రొమాంటిక్ ట్రాక్స్ ఇతర కీలక సన్నివేశాలతో పాటుగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది.
మరి ఇప్పుడు ఇదే సీక్వెన్స్ కు సంబంధించి మరిన్ని ఫోటోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఫోటోలను చూస్తే మాత్రం ఈ యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ లెవెల్ ఛేజింగ్ సీక్వెన్స్ ను తలపించేలా అనిపిస్తుంది. జస్ట్ ఫొటోస్ ను చూస్తేనే ఓ రేంజ్ లో అనిపిస్తుంది. మరి సిల్వర్ స్క్రీన్ పై ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి మొత్తానికి మాత్రం పరశురామ్ మహేష్ తో ఏదో నెవర్ బిఫోర్ గానే ప్లాన్ చేశారు. అదేంటో తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్ససిందే ఇక.