ప్రస్తుతం సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సోలో బతుకే సో బెటర్”. టైటిల్ మరియు టీజర్ల తోనే యూత్ ను అట్రాక్ట్ చేసిన ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మంచి హైప్ ను తెచ్చుకున్న చిత్రంగా మారింది. అయితే ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా లాక్ డౌన్ కారణంగా అనేక చిత్రాలతో పాటు ఇది కూడా నిలిచిపోయింది.
అయితే ఈ గ్యాప్ లో చిత్ర యూనిట్ కొన్ని అప్డేట్స్ తో ఊరించినా తర్వాత ఈ చిత్రం కూడా డైరెక్ట్ ఓటిటి లోనే వచ్చేస్తుంది అని టాక్ వినిపించింది. ఇప్పుడు వీటికి తోడు సాయి తేజ్ పెట్టిన లేటెస్ట్ ట్వీట్ చూస్తుంటే కొంచెం అందుకు హింట్ ఇచ్చేలా అనిపిస్తుంది. ఒకపక్క తన సినిమాకు రిలేటివ్ గా మరోపక్క తాను కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నాడా అన్నట్టుగా ఒక వాట్సాప్ వీడియో లాంటిది వదిలాడు.
“ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….” అంటూ తమ సింగిల్స్ ఆర్మీ వాట్సాప్ గ్రూప్ లో ప్రభాస్ కు సారీ చెప్పి తాను కూడా ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యిపోయాడు. దీనితో తాను తీస్తున్న లేటెస్ట్ సినిమాకు మరియు తన పెళ్ళికి సంబంధించి రెండు వెర్షన్ లను వదిలాడు. అసలు మేటర్ ఏంటి అన్నది తెలియాలి అంటే రేపు రేపు ఉదయం 10 గంటల వరకు వెయిట్ చెయ్యాలని ట్వీట్ చేసాడు. మొత్తానికి సాయి తేజ్ పెట్టిన ఈ వీడియో మాత్రం మంచి ఫన్నీగా ఉంది.
ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….
More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJu
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020