నా సినీ కెరీర్‌లో ఇదే తొలిసారి – పవన్ కళ్యాణ్

నా సినీ కెరీర్‌లో ఇదే తొలిసారి – పవన్ కళ్యాణ్

Published on Jul 24, 2025 9:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్స్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దీంతో తొలి రోజు కూడా సాలిడ్ బుకింగ్స్ జరగడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండబోతున్నాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన స్పీచ్ ప్రారంభిస్తూనే ఈ సభను ఏమంటారు.. అంటూ యాంకర్‌ను అడగడం అక్కడున్నవారిని నవ్వించింది. తన సినీ కెరీర్‌లో ఇలా ఓ సక్సెస్ మీట్‌కు రావడం ఇదే తొలిసారి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కేవలం సినిమా చేయడమే తనకు తెలుసని.. ఇలా సినిమాను ప్రమోట్ చేసి, దాని సక్సెస్ మీట్‌లో పాల్గొనడం లాంటివి తెలియదని ఆయన అన్నారు.

ఇక ఈ సక్సెస్ మీట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్, దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏ.ఎం.రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు