మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ ఎలిమెంట్స్ తో కూడిన సందేశాత్మక చిత్రాలు తీయడంలో స్పెషలిస్ట్ అయినటువంటి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “ఆచార్య”. మెగా ఫ్యాన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ నుంచి నిన్న చిరు పుట్టినరోజు సందర్భంగా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ టీజర్ ను విడుదల చెయ్యడంతో భారీ హైప్ నమోదు అయ్యింది.
అయితే ఈ పోస్టర్ ను చూసినట్లయితే అక్కడేదో భారీ యాక్షన్ సీక్వేన్సే ఉండనుంది అని అర్ధం అయ్యిపోయింది. అయితే ఈ పోస్టర్ తోనే కొరటాల ఈ చిత్రంలో ఈ ఎపిసోడ్ ఎలా ఉండనుందో తెలపనున్నారట. మెగాస్టార్ చిరుకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఇదని టాక్. ఇప్పటికే ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను కొరటాల అద్భుతంగా తెరకెక్కిచారని తెలిసిందే. పర్టికులర్ గా ఈ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం వేరే లెవెల్లో ఉండనుంది అని తెలుస్తుంది.