శేష్, మృణాల్ ‘డెకాయిట్’ కి ఫైనల్ గా రిలీజ్ డేట్!

శేష్, మృణాల్ ‘డెకాయిట్’ కి ఫైనల్ గా రిలీజ్ డేట్!

Published on Oct 28, 2025 2:05 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శనేయిల్ డియో తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కొన్నాళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రిలీజ్ డేట్ కూడా అలా సస్పెన్స్ గానే ఉండగా ఫైనల్ గా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని లీడ్ జంటపై ఓ పోస్టర్ తో రివీల్ చేశారు.

దీనితో వచ్చే ఏడాది మార్చ్ 19న తెలుగు, హిందీ, భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసేసారు. సో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు ఇంకొంత సమయం వేచి చూడక తప్పదు.ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు