OG : ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన పవర్ స్టార్ మూవీ!

OG Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ పూర్తి గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలాగైతే చూడాలని ఆశపడ్డారో, సుజీత్ అదే విధంగా చూపెట్టడంతో ఈ సినిమాకు ఫ్యాన్స్ పట్టం కట్టారు.

ఇక బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఓజీ, ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన అన్‌కట్ వెర్షన్‌ను ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ, థియేట్రికల్ వెర్షన్ ఎలాగైతే ఉందో, అదే విధంగా ఓటీటీ వెర్షన్ కూడా ఉండటంతో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. డిలీటెడ్ సీన్స్ కూడా యాడ్ చేసి ఉంటే బాగుండేదని వారు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version