‘సుద్దపూస’ లాంటి టైటిల్ పట్టుకొచ్చిన శివాజీ

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో వచ్చిన ‘#90’s’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్‌తో నటుడు శివాజీ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చారని చెప్పాలి. ఆ తర్వాత ఆయన పలు ఇంట్రెస్టింగ్ పాత్రలు చేస్తూ దూసుకెళ్తుననారు. అయితే, #90s సిరీస్‌లోని ‘‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’’ అనే పాపులర్ లైన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే, ఇప్పుడు ఇదే సినిమా టైటిల్‌తో ఓ చిత్రాన్ని శివాజీ స్వయంగా నిర్మిస్తున్నారు. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రానున్న సినిమాను సుధీర్ శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో శివాజీతో పాటు లయ, #90s ఫేం చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రిన్స్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయగా, దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version