ఈసారి కామెడీని నమ్ముకున్న రేణు దేశాయ్..?

Renu-desai

నటి రేణు దేశాయ్ మాస్ రాజా రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వర్ రావు’ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించారు. ఆ సినిమాలో సామాజికవేత్త ‘హేమలత లవణం’ పాత్రలో నటించి మెప్పించారు రేణు దేశాయ్. కానీ, ఆ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. దీంతో రేణు దేశాయ్ ఆశించిన సాలిడ్ కమ్ బ్యాక్ ఆమెకు రాలేదు.

దీంతో ఇప్పుడు ఆమె మరోసారి కథల ఎంపికపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆమెకు చాలా సినిమా ఆఫర్లు వస్తున్నా, తనకు నచ్చిన పాత్ర కోసం ఆమె ఎదురుచూస్తోందట. ఈ క్రమంలో ఓ కమర్షియల్ సినిమాలో ఒక పాత్ర చేసేందుకు ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది.

అయితే, ఈసారి కామెడీ టచ్ ఉన్న పాత్రను ఆమె ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ అత్త పాత్రలో నటించేందుకు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సినీ సర్కిల్స్ టాక్. ఇంతకీ ఆమె ఓకే చెప్పిన సినిమా ఏమిటి.. అందులో హీరో, హీరోయిన్ ఎవరు.. వంటి మిగతా విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Exit mobile version