‘జాంబీరెడ్డి 2’.. అప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్..?

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘జాంబీ రెడ్డి’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా, టాలీవుడ్‌కు జాంబీ జోనర్‌ను పరిచయం చేసిన సినిమాగా ఇది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాతే ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా ‘హనుమాన్’ చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు.

అయితే, ఇప్పుడు ‘జాంబీ రెడ్డి 2’ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రెడీ అవుతోంది. ఈ సీక్వెల్ మూవీలో తేజ సజ్జా మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాను ప్రశాంత్ వర్మ కాకుండా మరో డైరెక్టర్ తెరకెక్కించబోతున్నాడు.

కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ క్లో్జ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏకంగా రూ.42 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version