శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ విడుదల

ప్రజా నాయకుడు, పేద ప్రజల పక్షపాతి గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో, కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు.

ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ సినీ వర్గాల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి.

గుమ్మడి నర్సయ్య పాత్రలో శివ రాజ్ కుమార్ లుక్ అద్భుతంగా ఉంది. ఆయన వేషధారణ, సైకిల్, ఎర్ర కండువా, వెనుక అసెంబ్లీ నేపథ్యం వంటి అంశాలు పాత్రకు పూర్తి వాస్తవికతను తీసుకొచ్చాయి. మోషన్ పోస్టర్‌లో, ఇతర ఎమ్మెల్యేలు కార్లలో వస్తుండగా… నర్సయ్య మాత్రం సైకిల్‌పై సామాన్యంగా కనిపించడం, దానికి తోడు సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం (RR) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

నిర్మాత సురేష్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సత్య గిడుటూరి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. మిగిలిన వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version