టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మోగ్లీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది.
అయితే, తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ ‘సయ్యారే’ను తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. కాలభైరవ సోల్‌ఫుల్ ట్యూన్స్‌తో ఈ పాటను కంపోజ్ చేసిన తీరు ప్రేక్షకులను కట్టిపడేయనుందని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు.
ఈ పాటను అక్టోబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ మెలోడీ పాట ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమాలో రోషన్ కనకాల, సాక్షి మద్హోల్కర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి