“ఉప్పెన”కు ముందు మంచి టార్గెట్ లే ఉన్నాయ్.!

చాలా కాలం తర్వాత ఓ మిడ్ బడ్జెట్ సినిమాల్లో మంచి మోస్ట్ అవైటెడ్ గా అంతా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఉప్పెన” సినిమానే అని చెప్పాలి. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై ఓ డెబ్యూ హీరో చేసిన అన్ని సినిమాల్లో కల్లా భారీ హైప్ నెలకొంది.

మంచి బ్యానర్ దేవిశ్రీ సంగీతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం ఇలా చాలానే అంశాలు ఈ చిత్రానికి భారీ హైప్ ను తెచ్చి పెట్టాయి. దీనితో ఈ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ మరియు లాంగ్ రన్ వసూళ్లను రాబడుతుందా అని అంతా ఉత్కంఠగా మారింది. అయితే మరి అందులో భాగంగానే ఈ సినిమాకు మంచి టార్గెట్ లే ఉన్నట్టు తెలుస్తుంది.

సినిమాకు జరిగిన బిజినెస్ టార్గెట్ ఒకటి అయితే అంతకు మించి కానీ 25 కోట్ల మేర షేర్ రాబడితే డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ కు ఒక అరుదైన రికార్డు దక్కినట్టే అని చెప్పాలి. ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా చుట్టూతా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలా పెర్ఫామ్ చేస్తుందో తెలియాలి అంటే ఈ 12 వరకు ఆగాల్సిందే.

Exit mobile version