పవన్ సినిమాపై అవన్నీ జస్ట్ రూమర్లేనా.!

పవన్ సినిమాపై అవన్నీ జస్ట్ రూమర్లేనా.!

Published on Feb 19, 2021 8:04 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రీమేక్ సినిమాలు అలాగే కొన్ని స్ట్రైట్ చిత్రాలతో పవన్ ఎప్పుడూ లేని విధంగా శరవేగంగా పూర్తి చేసేస్తున్నారు. మరి దీనితో ఇదే ఊపులో అనేక రకాల గాసిప్స్ కూడా పవన్ సినిమాపై మొదలయ్యాయి.

పవన్ కళ్యాణ్ మరియు సెన్సేషనల్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో ఒక సినిమా ఉందని రూమర్స్ వైరల్ అయ్యాయి. అది కూడా పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ నిర్మాణంలోనే అని మరో టాక్ కూడా ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే ఇవన్నీ జస్ట్ రూమర్స్ గానే వినిపిస్తున్నాయి.

ఎందుకంటే బండ్ల గణేష్ కూడా ఒకవేళ ఏదన్నా సినిమా స్టార్ట్ చేసినట్టు అయితే తానే చెప్తాను ఎలాంటి వదంతులు చెప్తున్నాడు. మరి ఇది ఇన్ డైరెక్ట్ గా ఆ ప్రాజెక్ట్ కోసమే అన్నట్టు తెలుస్తుంది. మరి అలాగే ఇంకా ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ మరియు పూరీలా నడుమ చర్చ వచ్చినట్టుగా కూడా దాఖలాలు లేవు సో ఇవన్నీ కేవలం రూమర్స్ అనే చెప్పాలి. ఒకవేళ ఫ్యూచర్ లో ఉంటే ఉండొచ్చేమో కనై ఇప్పటికి అయితే ఏమీ లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు