మహేష్ సాలిడ్ ప్రాజెక్ట్ కు చాలా టైం ఉందా.?

మహేష్ సాలిడ్ ప్రాజెక్ట్ కు చాలా టైం ఉందా.?

Published on Aug 23, 2020 9:03 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ ప్రాజెక్ట్ లైన్ లో ఉండగానే దర్శక ధీరుడు రాజమౌళితో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చెయ్యడంతో మహేష్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సుకత నెలకొంది.

దీనితో ఈ ఇద్దరి కాంబోలో ఎప్పుడు ఈ చిత్రం మొదలు అవుతుంది అలాగే ఎలాంటి జానర్ చిత్రాన్ని మహేష్ తో రాజమౌళి చెయ్యనున్నారు అనే ప్రశ్న కూడా మంచి హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ మరియు రాజమౌళిల సాలిడ్ కాంబో మొదలు అయ్యేందుకు చాలా సమయమే పడుతుందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే లోపు మహేష్ మరో సినిమా చేసేసే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు