సేఫ్ డేట్ చూసుకున్న శ్రీసింహ

సేఫ్ డేట్ చూసుకున్న శ్రీసింహ

Published on Feb 12, 2021 2:23 AM IST


‘మత్తువదలరా’తో హీరోగా పరిచయమయ్యాడు సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి. ఈ సినిమాలో ఆతని నటనకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కూడ మంచి విజయాన్ని అందుకుంది. మొదటి చిత్రంతోనే కథల విషయంలో తన భిన్నమైన అభిరుచిని తెలియజేసిన శ్రీసింహ రెండవ సినిమా విషయంలో కూడ అదే ఫాలో అవుతున్నారు. అదే ‘తెల్లవారితే గురువారం’. ఇది కూడ ఒక్క రాత్రిలో జరిగే స్టోరీ అని తెలుస్తోంది.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే హీరోకు రెండు ప్రేమ కథలు ఉంటాయని అర్థమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయనున్నారు. మార్చి 26 శుక్రవారం ‘అరణ్య, రంగ్ దే’ సినిమాలున్నాయి. అందుకే సేఫ్ గా మార్చి 27 శనివారాన్ని విడుదల తేదీగా నిర్ణయించారు. నూతన దర్శకుడు మనికాంత్ గెల్లి‌ దర్శకత్వంలో సాయి కొర్రపాటితో కలిసి రజినీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రా శుక్ల, మిషా నారంగ్‌ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు