‘సుశాంత్‌ సింగ్‌ ‘ ఆత్మహత్యకు కారణం !

‘సుశాంత్‌ సింగ్‌ ‘ ఆత్మహత్యకు కారణం !

Published on Jun 14, 2020 11:03 PM IST

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్యకు కారణం మానసిక ఒత్తిడి అని తెలుస్తోంది. గత ఆరు నెలలుగా సుశాంత్‌ మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని, ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సుశాంత్‌ సన్నిహితులు సైతం మానసిక ఒత్తిడితో సుశాంత్ బాధ పడుతున్న విషయాన్ని చెబుతున్నారు. ఈ రోజు ఉదయమే ఉరివేసుకుని చనియారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆయన గది నుంచి ఎలాంటి సుసైడ్‌ నోట్‌ను దొరకలేదు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బలవన్మరణానికి పాల్పడటంతో… ఈ దిగ్భ్రాంతికర వార్త బాలీవుడ్‌ ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. ‘నేను షాక్‌కు గురయ్యా.. ఇది నిజం కాదు’ అని దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ట్వీట్ చేయిగా, ‘ఈ వార్త వినగానే నిజంగా నేను షాక్‌కు గురయ్యా. నాకు మాటలు రావడం లేదు. మంచి టాలెంట్‌ ఉన్న నటుడు సుశాంత్‌. ఈ విషాద ఘటనను తట్టుకునేలా వారి కుటుంబానికి దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని అక్షయ్‌ కుమార్‌ పోస్ట్ చేశారు. ‘నా హృదయం ముక్కలైంది. నా నోటివెంట మాటలు రావడం లేదు. ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా’ అని సోనూసూద్‌ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు