తమిళ స్టార్ హీరో ధనుష్ అవ్వడానికి తమిళ్ హీరో అయినా తన సినిమాలు రీసెంట్ గా మాత్రం తమిళ్ వెర్షన్ కంటే మన తెలుగు వెర్షన్ లోనే బాగా రాణిస్తుండడం విశేషం. అలా టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో చేసిన సార్ చిత్రానికి తమిళ్ వెర్షన్ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాగా ఇప్పుడు దర్శకుడు శేఖర్ కమ్ములతో చేసిన చిత్రం కుబేర కి కూడా ఇదే రిపీట్ అయ్యింది.
ముఖ్యంగా యూఎస్ మార్కెట్ లో తెలుగు వసూళ్లు తమిళ్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పుడు వరకు తమిళ్ వెర్షన్ కి లక్ష డాలర్స్ గ్రాస్ కూడా దాటలేదు కానీ తెలుగు వెర్షన్ కి మాత్రం 3 లక్షల 27 వేల డాలర్స్ కి పైగా వసూళ్లు వచ్చాయి. దీనితో 4 లక్షలకి పైగా డాలర్స్ తో కుబేర సాలిడ్ వసూళ్లు నమోదు చేసింది. మరి తమిళ్ వెర్షన్ కంటే తెలుగులోనే ఎన్నో ఎక్కువ రావడం అనేది ఆ డామినేషన్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.